Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ పెళ్లి వేడుకలో ‘బెల్లీ డ్యాన్స్’.. అరెస్టులు!

  • చాంద్రాయణగుట్టలోని ఓ ఫంక్షన్ హాల్ లో బెల్లీ డ్యాన్స్
  • ఈ డ్యాన్స్ కోసం రూ.15 లక్షల ఖర్చు 
  • నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ లోని పాతబస్తీలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్ నిర్వహించడం కలకలం రేపుతోంది. చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ డ్యాన్స్ జరిగింది. అనుమతి లేకుండా ఈ డ్యాన్స్ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి కొడుకు తండ్రిని, ఫంక్షన్ హాల్ ఓనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, పెళ్లి కొడుకు తన దుబాయ్ ఫ్రెండ్స్ కోసం బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు చేశారని, శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇది నిర్వహించారని చెప్పారు. డ్యాన్సర్లలో రష్యన్ యువతులు, ముంబై యువతులు ఉన్నారని, వీరంతా అర్ధనగ్నంగా నృత్యాలు చేశారని అన్నారు. బెల్లీ డ్యాన్స్ కోసం యువతులను తీసుకొచ్చిన ఆర్గనైజర్ ను గుర్తించామని, జూబ్లీ హిల్స్ కు చెందిన వెంకట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేశారని చెప్పారు. బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు నిమిత్తం పెళ్లికొడుకు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసిందని అన్నారు. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad
belly dance

More Telugu News